పాకిస్థాన్ ఖైదీని రాళ్లతో కొట్టి చంపిన భారత ఖైదీలు

Wed,February 20, 2019 04:16 PM

Pakistan prisoner killed in Jaipur Central Jail after brawl with other prisoners

జైపూర్: పాకిస్థాన్‌కు చెందిన ఖైదీని తోటి ఖైదీలు రాళ్లతో కొట్టి చంపారు. రాజస్థాన్‌లోని జైపూర్ సెంట్రల్ జైల్లో బుధవారం ఈ ఘటన జరిగింది. తోటి ఖైదీలతో జరిగిన గొడవలో పాక్ ఖైదీ మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన జరగగానే సీనియర్ పోలీస్ అధికారులు జైలుకు వెళ్లారు. పాక్ ఖైదీని హత్య చేసిన మాట నిజమేనని జైళ్ల శాఖ ఐజీ రూపిందర్ సింగ్ వెల్లడించారు. 2011 నుంచి సదరు పాక్ ఖైదీ ఇదే జైల్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. హత్యకు గురైన పాకిస్థాన్ ఖైదీని షకీరుల్లాగా గుర్తించారు. గూఢచర్యం కేసులో ఇతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని ముగ్గురు తోటి ఖైదీలు హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. పుల్వామా ఉగ్ర‌దాడి త‌ర్వాత పాకిస్థాన్‌పై ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఈ హ‌త్య ప్రాధాన్యం సంత‌రించుకుంది.

3112
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles