సిక్కీం సీఎంగా ప్రేమ్‌సింగ్ త‌మాంగ్ ప్ర‌మాణం

Mon,May 27, 2019 02:37 PM

P.S. Golay sworn in as Sikkim Chief Minister

హైద‌రాబాద్‌: సిక్కీం ముఖ్యమంత్రిగా ప్రేమ్‌సింగ్ త‌మాంగ్ ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేశారు. గ‌వ‌ర్న‌ర్ గంగా ప్ర‌సాద్ ఆయ‌న చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు. గ్యాంగ్‌ట‌క్‌లోని ప‌ల్జోర్ స్టేడియంలో ఈ వేడుక జ‌రిగింది. సిక్కిం క్రాంతికారి మోర్చా మ‌ద్ద‌తు దారులు ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి భారీ సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. 51 ఏళ్ల త‌మాంగ్ నేపాలీ భాష‌లో ప్ర‌మాణ స్వీకారం చేశారు. సిక్కీం అసెంబ్లీలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఎస్కేఎం, ఎస్డీఎఫ్‌ పార్టీల మధ్య హోరాహోరి పోరు సాగింది. గురువారం అర్ధరాత్రి వరకు జరిగిన లెక్కింపులో ఎస్కేఎం 17 స్థానాల్లో మెజార్టీ సాధించగా.. ఎస్టీఎఫ్ 15 స్థానాలతో తృటిలో అధికారాన్ని కోల్పోయింది.

1066
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles