ఆ 6 వేలు నేరుగా మహిళల అకౌంట్లోకే

Wed,March 27, 2019 12:11 PM

P Chidambaram on minimum income guarantee scheme

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస ఆదాయ హామీ పథకం కింద ప్రతీ కుటుంబానికి ఏటా రూ. 72 వేలు అందజేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించిన విషయం విదితమే. దీనిపై ఆ పార్టీ సీనియర్‌ నేత పి. చిదంబరం మాట్లాడుతూ.. 5 కోట్ల కుటుంబాలకు ప్రతి నెల రూ. 6 వేల చొప్పున ఇస్తామన్నారు. ఈ రూ. 6 వేలను నేరుగా మహిళల అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు. అయితే ఈ పథకానికి సరిపోయే నిధులు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. ప్రస్తుతం దేశ ఆదాయం రూ. 200 లక్షల కోట్లు ఉందన్నారు. ఈ ఆదాయం ప్రతి సంవత్సరం 12 శాతం పెరుగుతుందన్నారు. వచ్చే ఆరేళ్లలో ఆదాయం కూడా రెట్టింపు అవుతుందన్నారు. ఈ క్రమంలో 2019-24 మధ్య కాలంలో జీడీపీ రూ. 200 లక్షల కోట్ల నుంచి రూ. 400 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉందని చిదంబరం తెలిపారు. దీంతో కనీస ఆదాయ హామీ పథకం అమలు చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు రావని విశ్వసిస్తున్నామని చెప్పారు.

6594
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles