వీడియో: కస్టమర్‌పై వేడి నూనె పోసిన హోటల్ యజమాని!

Thu,November 9, 2017 01:32 PM

Owner of a roadside eatery threw hot oil on a customer in Thane

థానె: ఫుడ్ సరిగా లేదన్నాడని.. ఓ కస్టమర్‌పై సలసల కాగే వేడి నూనెను పోశాడు ఓ హోటల్ యజమాని. ఈ ఘటన ముంబై శివారు.. ఉల్లాస్‌నగర్‌లో చోటు చేసుకున్నది. రోడ్ పక్కన ఉండే ఓ హోటల్‌కు వెళ్లిన కస్టమర్ ఫుడ్ సరిగా సర్వ్ చేయలేదని.. టేస్ట్ కూడా సరిగా లేదని.. హోటల్ యజమానితో గొడవ పెట్టుకున్నాడు.

దీంతో చిర్రెత్తిన హోటల్ యజమాని మూకుడులో ఉన్న వేడి నూనెను మగ్గులో ముంచి అతడి మీద పోశాడు. అయితే.. అంతలోనే కస్టమర్ తప్పించుకొని పారిపోయాడు. అయినప్పటికీ.. అతడి వెంట పడి మరీ మీద నూనె పోయడానికి ట్రై చేశాడు యజమాని. ఇక.. ఈ ఘటన అంతా హోటల్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. కస్టమర్ ఇచ్చిన కంప్లయింట్ మేరకు.. ఫుటేజిని పరిశీలించిన పోలీసులు హోటల్ యజమానితో పాటు సర్వర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.5182
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS