నగ్నంగా డ్యాన్స్ చేయమని వేధింపులు

Mon,June 10, 2019 11:54 AM

Over 500 men try to force women dancers to strip at cultural event in Assam

హైదరాబాద్ : నగ్నంగా డ్యాన్స్ చేయమని కొంతమంది మహిళలను వేధింపులకు గురి చేశారు. అంతటితో ఆగకుండా వారిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన అసోంలోని కామ్‌రూప్ జిల్లాలో చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌కు చెందిన ట్రూప్ డ్యాన్సర్ల చేత అసోంలోని అసోల్‌పారాలో నగ్న నృత్య ప్రదర్శన నిర్వహిస్తున్నామని నిర్వాహకులు షాహూరుఖ్ ఖాన్, సుభాహాన్ ఖాన్ ప్రకటించారు. అంతే కాకుండా షోను చూసేందుకు వచ్చిన వారికి అధిక ధరలకు టికెట్లు అమ్మారు.

అయితే ట్రూప్ డ్యాన్సర్లు డ్యాన్స్ చేస్తుండగా.. నగ్నంగా నృత్యం చేయాలని అక్కడికి వచ్చిన సుమారు 500 మంది యువకులు డిమాండ్ చేశారు. ఇందుకు డ్యాన్సర్లు నిరాకరించారు. డ్యాన్సర్ల పట్ల యువకులు అసభ్యకరంగా ప్రవర్తించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అక్కడ్నుంచి వారు తప్పించుకున్నారు. డ్యాన్సర్లు వెళ్తున్న వాహనాలపై రాళ్లతో దాడి చేశారు. దీంతో షో నిర్వహించిన షాహూరుఖ్ ఖాన్, సుభాహాన్ ఖాన్‌లపై డ్యాన్సర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారిద్దరిని అరెస్టు చేశారు. అధిక మొత్తంలో డబ్బును వసూలు చేసేందుకే నగ్న నృత్య ప్రదర్శన అని ప్రకటన ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.

9277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles