250 మందికి పైగా ఉగ్రవాదులు హతం

Mon,March 4, 2019 09:52 AM

Over 250 terrorists killed in Balakot airstrike says Amit Shah

అహ్మదాబాద్‌ : ఫిబ్రవరి 26న బాలాకోట్‌లోని జైషే ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడులు చేసి 250 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా పేర్కొన్నారు. నిన్న గుజరాత్‌లో పర్యటించిన అమిత్‌ షా.. అక్కడ ఏర్పాటు చేసిన ఓ సభలో మాట్లాడారు. ఉరి దాడి తర్వాత భారత ఆర్మీ సర్జికల్‌ ైస్ట్రెక్స్‌ చేసింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేసి 250 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టామన్నారు. పాక్‌ ఆర్మీ కస్టడీలో ఉన్న భారత వింగ్‌ కమాండర్‌ విక్రం అభినందన్‌ వర్థమాన్‌ను 48 గంటల్లోనే విడుదల చేయించాం. ఇది మా దౌత్య విజయమని అమిత్‌ షా స్పష్టం చేశారు. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవడంలో ప్రపంచంలో యూనైటెడ్‌ స్టేట్స్‌, ఇజ్రాయెల్‌ తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉందన్నారు.

2353
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles