ఐదేళ్లలో ఆ ఆస్పత్రిలో వెయ్యి మందికి పైగా శిశువులు మృతి

Thu,February 21, 2019 10:29 AM

Over 1,000 Children Died In Adani-Run Hospital In Last 5 Years

గాంధీనగర్‌: గుజరాత్‌ రాష్ట్రం కుచ్‌ జిల్లా భుజ్‌ పట్టణంలోని ఆదానీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నడిచే జీకే జనరల్‌ ఆస్పత్రిలో గడిచిన ఐదేళ్లలో వెయ్యి మంది శిశువులు మృతిచెందారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిన్న శాసనసభ సమావేశంలో భాగంగా కాంగ్రెస్‌ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చింది. గడిచిన ఐదేళ్లలో ఆ ఆస్పత్రిలో మొత్తం 1,018 మంది శిశువులు మరణించినట్లు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి నితిన్‌ పటేల్‌ వెల్లడించారు. 2014-15లో 188 మంది, 2015-16లో 187 మంది, 2016-17లో 208 మంది, 2017-18లో 276 మంది, 2018-19లో ఇప్పటి వరకు 159 మంది శిశువులు వివిధ కారణాలతో మృతిచెందినట్లుగా నివేదికలో వెల్లడించారు. దీనిపై విచారణకు ఓ కమిటీని గతేడాది మే నెలలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నెలలు నిండకముందే జన్మించడం, అంటురోగాలు, శ్వాసకోశ సమస్యలు ఇతర కారణాలతో శిశువులు మృతిచెందినట్లు కమిటీ నివేదిక పేర్కొంది.

626
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles