భోపాల్ లో 100 దుకాణాలు దగ్ధం..

Sun,December 17, 2017 11:04 PM

Over 100 shops gutted in Bhopal's shopping complex fire


మధ్యప్రదేశ్ : భోపాల్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బైరాఘర్ ప్రాంతంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగి పక్కనున్న 100 దుకాణాలకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది 20 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాణ నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీంతో షాపుల్లోని ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కోట్లాది రూపాయల సరుకు బుగ్గిపాలైందని దుకాణాల యజమానులు ఆందోళన చెందుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది.

1152
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS