మా స్నేహబంధం కొనసాగుతూనే ఉంటుంది : మాయావతి

Tue,June 4, 2019 11:28 AM

Our relation is not only for politics it will continue forever says Mayawati

హైదరాబాద్ : సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ తనకు ఎంతో గౌరవం ఇచ్చారని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా తమ మధ్య ఉన్న విబేధాలన్నింటిని మరిచిపోయామని ఆమె తెలిపారు. తమ మధ్య బంధం రాజకీయాల కోసం కాదు.. ఈ స్నేహబంధం ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుందని మాయావతి తేల్చిచెప్పారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యాదవ కమ్యూనిటీ సమాజ్‌వాదీ పార్టీకి మద్దతు ఇవ్వలేదని.. ఈ క్రమంలో బలమైన నాయకులు కూడా ఓటమి పాలయ్యారని ఆమె పేర్కొన్నారు. మహాకూటమి బ్రేకప్ శాశ్వతం కాదు.. తాత్కాలికమేనని మాయావతి స్పష్టం చేశారు. అఖిలేష్ యాదవ్ భవిష్యత్‌లో మంచి విజయాలు సాధిస్తే అతనితో కలిసి పని చేస్తాం. ఒక వేళ అతను విజయం సాధించలేకపోతే ఒంటరిగానే ముందుకెళ్తాం. మొత్తానికి త్వరలో యూపీలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని మాయావతి స్పష్టం చేశారు.

1970
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles