ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎంపీల రాజీనామాః జగన్

Tue,February 13, 2018 05:38 PM

Our MPs will resign if AP is not given special status by April 5th says YS Jaganmohan Reddy

నెల్లూరుః ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. ఏప్రిల్ 5లోగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏప్రిల్ 6న తమ ఎంపీలంతా రాజీనామాలు చేస్తారని స్పష్టంచేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న జగన్.. నెల్లూరులో ఈ కీలక ప్రకటన చేశారు. ఓవైపు అధికార టీడీపీ ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తుంటే.. వైసీపీ మాత్రం ఎప్పటి నుంచో ప్రత్యేక హోదానే డిమాండ్ చేస్తున్నది. పార్లమెంట్‌లోనూ ఆ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

1686
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS