మ‌న ఇల్లు త‌గ‌ల‌బ‌డుతోంది..

Fri,August 23, 2019 06:58 PM

Our house is burning, tweets France President Emmanuel Macron on Amazon Rainforest

హైద‌రాబాద్: బ్రెజిల్‌లోని అమెజాన్ వ‌ర్షార‌ణ్యంలో చెల‌రేగుతున్న దావాన‌లంపై ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఎమ్మాన్యువ‌ల్ మాక్ర‌న్ స్పందించారు. మ‌న‌ ఇల్లు మండుతోంద‌ని ఆయ‌న త‌న అభిప్రాయాన్ని ట్విట్ట‌ర్‌లో వ్య‌క్తం చేశారు. భూ గ్ర‌హానికి సుమారు 20 శాతం ఆక్సిజ‌న్ అందించే అమెజాన్ త‌గ‌ల‌బ‌డుతున్న తీరు ఆంద‌ళ‌న క‌లిగిస్తుందని ఆయ‌న అన్నారు. ఇది అంత‌ర్జాతీయ విపత్తు అని అన్నారు. జీ7 స‌భ్య‌దేశాలు ఈ అంశాన్ని అత్య‌వ‌స‌రంగా చ‌ర్చించాల‌ని మాక్ర‌న్ తెలిపారు. అమెజాన్ కోసం అంద‌రూ ముందుకు రావాల‌న్నారు. జ‌ర్మ‌న్ ఛాన్స‌ల‌ర్ ఏంజెలా మెర్క‌ల్ కూడా స్పందించారు. అమెజాన్ అడ‌వుల అంశాన్ని వెంట‌నే చ‌ర్చించాల‌న్న అభిప్రాయాన్ని ఆమె వినిపించారు. మ‌రో వైపు బ్రెజిల్ దేశాధ్య‌క్షుడు జెయిర్ బొల్స‌నారో మాత్రం తన విధానాల‌ను స‌మ‌ర్థించుకుంటున్నారు.


1569
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles