మన భవిష్యత్ దానిమీదే ఆధారపడి ఉంది: రతన్ టాటా

Fri,March 15, 2019 03:09 PM

our future depends on voting says Ratan Tata

ముంబయి: జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అర్హులైన ప్రతిఒక్కరూ పోలింగ్ పాల్గొని ఓటేయాల్సిందిగా ప్రధాని సహా, ఎన్నికల సంఘం, వివిధ రంగాల ప్రముఖులు పిలుపునిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఓటేయడం ప్రతి పౌరుడి అత్యంత శక్తివంతమైన హక్కు అన్నారు. అంతేకాకుండా అది మన బాధ్యతన్నారు. దయచేసి అందరూ ఓటేయండి. మన భవిష్యత్ దానిపైనే ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు.



863
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles