బెంగళూరులో ప్రతిపక్షాల షో

Wed,May 23, 2018 05:00 PM

Opposition parties share stage as Kumaraswamy takes Oath

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవాన్ని ప్రతిపక్షాలు తమ ఐక్యతను చాటుకునే వేదికగా మార్చేశాయి. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నేతలు, పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేరళ సీఎం పినరయి విజయన్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజ్‌ప్రతాప్ యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి ఎ రాజా ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చారు.వీళ్లంతా కుమారస్వామిని అభినందించారు. ఈ సందర్భంగా నేతలంతా ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత నేతలంతా వేదికపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ఒకరకంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ బెంగళూరు విధానసౌధ ముందు కొలువుదీరాయి. సీఎం కేసీఆర్ ఒకరోజు ముందే బెంగళూరు వెళ్లి కుమారస్వామిని అభినందించి వచ్చిన విషయం తెలిసిందే.3266
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS