మెడికల్ షాపులోకి బాంబు విసిరిన దుండగులు

Tue,May 30, 2017 08:37 AM

One person died in Nagaland bomb blast

నాగాలాండ్: నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో జరిగిన బాంబు పేలుడులో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు స్థానికంగా ఉన్న చర్చిరోడ్‌లో గల మెడికల్ దుకాణంలోకి క్రూడ్ బాంబు విసిరి పారిపోయారు. ఆ సమయంలో షాపులో ముగ్గురు సెల్స్‌మెన్, ఇద్దరు వినియోగదారులు ఉన్నారు. బాంబు పేలుడులో వినియోగదారుల్లో అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గడిచిన రాత్రి మృతిచెందాడు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక పోలీసు అధికారులు పేర్కొన్నారు.

862
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles