ఎదురుకాల్పుల్లో ఒక జవాన్ మృతి

Mon,March 18, 2019 09:31 PM

one CRPF jawan killed and 5 injured in Naxal attack in Chhattisgarh

కొత్తగూడెం : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులకు, భద్రతా దళాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక జవాన్ మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యారు. తెలిసిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు కూంబింగ్ ఆపరేషన్సును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే జిల్లాలోని ఆర్నపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఆర్పీఎఫ్ 231 బెటాలియన్‌కు చెందిన రోడ్ ఓపెన్ పార్టీ (ఆర్‌వోపీ) బలగాలు సెర్చింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కొండపార ప్రాంతం సమీపంలో కాచుకుని కూర్చున్న మావోయిస్టులు భద్రతా బలగాలపై మెరుపుదాడి చేస్తూ కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు సైతం ఎదురు కాల్పులకు దిగారు. ఇరువర్గాల మధ్య సుమారు 30నిమిషాలకు పైగా భీకరపోరు జరిగింది. కాసేపటి జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ 231 బెటాలియన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ తివారి మృతి చెందాడని, మరో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయని అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు. కాగా గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌కు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

1973
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles