రాఫెల్ వస్తే పాకిస్థాన్ మన సరిహద్దు దగ్గరికి కూడా రాదు: ఎయిర్‌ఫోర్స్ చీఫ్

Mon,March 25, 2019 01:38 PM

Once we get Rafale Pakistan will not even come close to LoC says Air Chief Marshal BS Dhanoa

న్యూఢిల్లీ: ఒక్కసారి రాఫెల్ ఫైటర్ జెట్స్ మన చేతికి చిక్కితే ఇక ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు తిరుగుండదని, పాకిస్థాన్ కనీసం మన సరిహద్దు దగ్గరికి కూడా రాదని అన్నారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవా. సోమవారం చినూక్ హెలికాప్టర్లను ఎయిర్‌ఫోర్స్‌లోకి ప్రవేశపెట్టిన తర్వాత ఆయన మాట్లాడారు. రాఫెల్ అత్యాధునిక ఫైటర్ జెట్ అని, భారత ఉపఖండంలో ఇదో అత్యుత్తమ జెట్‌గా నిలవనుందని అన్నారు. రాఫెల్ వచ్చిన తర్వాత మన ఎయిర్‌ఫోర్స్ బలం ఎన్నో రెట్లు పెరుగుతుంది. అప్పుడు పాకిస్థాన్ కనీసం నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు దగ్గరకు కూడా రాదు. రాఫెల్‌లాంటి అత్యాధునిక ఫైటర్ జెట్స్‌ను సవాలు చేసే సామర్థ్యం పాకిస్థాన్ దగ్గర లేదు అని ధనోవా స్పష్టం చేశారు. 36 రాఫెల్ ఫైటర్ జెట్స్ కోసం ఇండియా ఒప్పందం కుదుర్చుకోగా.. అందులో మొదటిది ఈ ఏడాది సెప్టెంబర్‌లో రానుంది. మొన్న పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనే మన దగ్గర రాఫెల్ ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ప్రధాని మోదీ సహా రక్షణ అధికారులు కూడా అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఈ రాఫెల్‌లో ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్‌ను లోడ్ చేయొచ్చు. ఇవి 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా విజయవంతంగా ఛేదించగలవు.

2474
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles