దేశ‌మంతా హిందీ భాష ఉండాలి: అమిత్ షా

Sat,September 14, 2019 11:25 AM

On Hindi Diwas, Amit Shah pitches for One Language for the country

హైద‌రాబాద్: ఇవాళ హిందీ భాషా దినోత్స‌వం. ఈ నేప‌థ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో మ‌రోసారి దేశ‌మంతా ఒకే భాష ఉండాల‌న్న ఉద్దేశాన్ని వినిపించారు. హిందీని దేశ‌భాష‌గా గుర్తించాల‌ని ఆయ‌న త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. భార‌త దేశంలో ఎన్నో భాష‌లు ఉన్నాయ‌ని, ప్ర‌తి భాషాకూ ప్ర‌త్యేక‌త ఉంద‌ని, కానీ దేశ ప్ర‌జ‌ల కోసం ఒకే భాష ఉండాల‌ని, అదే మ‌న గుర్తింపుగా మారాల‌ని షా త‌న ట్వీట్‌లో తెలిపారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఒకే భాష అవ‌స‌రం అని, ఎక్క‌వ సంఖ్య‌లో జ‌నం హిందీ భాష‌నే మాట్లాడుతున్నార‌ని ఆయ‌న తెలిపారు. మాతృభాష‌ను వాడ‌టం పెంచుతూనే.. హిందీ భాష‌ను కూడా విరివిగా వాడాల‌న్నారు. దేశం మొత్తం ఒకే భాష ఉండాల‌న్న గాంధీ, ప‌టేల్ ఆశ‌యాల‌ను నెర‌వేర్చాల‌న్నారు.

1314
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles