హాస్పిటల్‌లో కరుణానిధి.. తొలి ఫొటో ఇదే

Sun,July 29, 2018 04:20 PM

Official Photo of Karunanidhi in hospital released

చెన్నై: తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తొలి అధికారిక ఫొటోను విడుదల చేశారు. ఆయన అధికారిక ట్విటర్ అకౌంట్‌లోనే ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శిస్తున్న సమయంలో తీసిన ఫొటో అది. ఆయన పక్కనే తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, కరుణానిధి తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, కూతురు కనిమొళి ఉన్నారు. చెన్నైలోని ఆల్వార్‌పేట్ కావేరీ హాస్పిటల్ ఐసీయూలోని ఫొటో ఇది. కరుణానిధి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాకర్లు వెంకయ్యనాయుడుకు చెప్పారు. శనివారం రాత్రి ఆయన ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్ ఓ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కరుణానిధి మూత్రనాళంలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 18న కరుణానిధిని ఆసుపత్రిలో చేర్చారు.

3783
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles