అనసూయపై అసభ్యకర వ్యాఖ్యలు..పోలీసులకు ఫిర్యాదు

Mon,July 22, 2019 07:28 AM

Offensive socialmedia posts can now land group administrator in jail

హైద‌రాబాద్‌: సోషల్ మీడియాలో యాప్‌ల ద్వారా అశ్లీలాన్ని ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రోగ్రెసీవ్ యూత్ లీగ్ కార్యదర్శి ప్రదీప్ ఆదివారం సీసీఎస్ సైబర్‌క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అనసూయ భరద్వాజ్ యాంకర్ ఫ్యాన్స్ గ్రూపు పేరుతో అచ్చం అందం, తెలుగు బ్యూటీ, ఆంధ్రాపోరీలు అదుర్స్ అంటూ ఫేసుబుక్‌లో గ్రూపులను సృష్టించి బూతు వీడియోలు ప్రత్యక్షంగా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో ప్రదీప్ పేర్కొన్నారు. షేర్ చాట్, విడ్ స్టాటస్, స్టాటస్ వీడియోస్, స్టాటస్ డౌన్ లోడర్ యాప్‌ల ద్వారా సభ్యులను చేర్చుకుంటూ అశ్లీలాన్ని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ అభ్యంతకర పోస్టింగ్‌లను చేస్తున్నవారిని గుర్తించి పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రదీప్, కృష్ణ, అంజి, దిలీప్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

2741
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles