సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రయత్నాల్లో సగం మాత్రమే విజయవంతం

Sat,September 7, 2019 01:36 PM

హైదరాబాద్‌ : ఇప్పటికీ జాబిల్లి దక్షిణ ధ్రువం మీదికి వెళ్లే సాహసం మాత్రం ఎవరూ చేయలేదు. కానీ భారత్‌ తన తొలి ప్రయత్నంలోనే దక్షిణ ధ్రువాన్ని ఎంచుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. చంద్రయాన్‌ 2 భూమి, చంద్రుడి కక్ష్యలను విజయవంతంగా పూర్తి చేసుకుని విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుని ఉపరితలంపై దిగనుందనగా స్పేస్‌ ఏజెన్సీతో సంబంధాలు తెగిపోయిన విషయం విదితమే. చంద్రుడికి అతి సమీపంలోకి వెళ్లిన ల్యాండర్‌ నుంచి సంకేతాల్లో అంతరాయం ఏర్పడింది. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరం వరకు సవ్యంగా సాగిన ల్యాండర్‌ ప్రయాణం.. అక్కడి నుంచి సంకేతాలు ఆగిపోయాయి.


అయితే చంద్రుడిపై చేసిన 38 సాఫ్ట్‌ ల్యాండింగ్ ప్రయత్నాల్లో సగం మాత్రమే విజయవంతం అయినట్లు విదేశీ మీడియా వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో చంద్రుడి ఉపరితలంపై ఇజ్రాయెల్‌ ఒక అంతరిక్ష నౌకను దింపడానికి ప్రయత్నించింది. కానీ చివరి క్షణాల్లో ఆ ప్రయోగం విఫలమైంది. యూనైటేడ్‌ స్టేట్స్‌, రష్యా, చైనా తర్వాత చంద్రయాన్‌ 2తో చంద్రునిపైకి అడుగుపెట్టిన నాల్గవ దేశంగా భారత్‌ మారుతుందని భావించినప్పటికీ అది చివరి క్షణాల్లో విఫలమైంది. మొత్తం మిషన్‌లో సున్నితమైన ల్యాండింగ్‌ ఒక్కటే క్లిష్టమైన అంశమని ఢిల్లీ యూనివర్సిటీ ఫిజిక్స్‌ అండ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ పాట్రిక్‌ దాస్‌ గుప్తా తెలిపారు.

రష్యా.. చంద్రుడిపైకి తొలిసారి ల్యూనా వ్యోమనౌకను దింపి తొలి దేశంగా రికా ర్డు నెలకొల్పింది. అమెరికా అపోలో మిషన్‌లో భాగంగా విజయవంతంగా మానవుడిని జాబిల్లిపైకి పంపింది. వారు ఉత్తర ధ్రువానికి సమీపాన ఉపరితలం మీదే దిగి పరిశోధనలు చేశారు. చైనా సైతం తన రోవర్ ను ఉత్తర ధ్రువంవైపే దింపింది. ఇస్రో వాటికీ భిన్నంగా.. దక్షిణ ధ్రువమే లక్ష్యంగా చంద్రయాన్-2ను రూపొందించి.. అతి తక్కువ వ్యయంతో ప్రయోగించింది.

3838
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles