భార్య, ఆమె ప్రియుడిని చంపిన భర్త

Wed,February 13, 2019 01:14 PM

భువనేశ్వర్‌ : వివాహేతర సంబంధం కొనసాగిస్తోన్న తన భార్యను, ఆమె ప్రియుడిని ఓ భర్త హత్య చేశాడు. ఈ సంఘటన ఒడిశా బాలసోర్‌ పట్టణంలోని రాణిపట్నాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కైలాష్‌ చంద్ర సాహు, లక్ష్మిప్రియ సాహు(32) భార్యాభర్తలు. కైలాష్‌ చంద్ర వేరే దగ్గర ఉంటూ పని చేస్తున్నాడు. లక్ష్మిప్రియ ఓ ప్రయివేటు సంస్థలో పని చేస్తుంది. ఈ క్రమంలో లక్ష్మిప్రియకు ప్రదీప్‌ కుమార్‌ దేయ్‌(45) అనే వ్యక్తి పరిచయం కావడంతో అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయాన్ని పసిగట్టిన కైలాష్‌ చంద్ర భార్యతో అనేకసార్లు గొడవ పెట్టుకున్నాడు. మొత్తానికి మంగళవారం రాత్రి లక్ష్మిప్రియ, ప్రదీప్‌ కలిసి ఉండడాన్ని గ్రహించిన కైలాష్‌.. వారిపై ఇనుపరాడ్డుతో దాడి చేసి హత్య చేశాడు. ఈ కేసులో కైలాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

3628
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles