నామినేష‌న్ వేసిన సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌

Wed,March 20, 2019 01:47 PM

Odisha CM Naveen Patnaik files nomination from Hinjili assembly constituency

హైద‌రాబాద్: ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌.. హింజ్లీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేవారు. గంజామ్ జిల్లాలోని హింజ్లీ నుంచి సీఎం న‌వీన్ పోటీ చేస్తున్నారు. చాత్రాపూర్‌లోని స‌బ్ క‌లెక్ట‌ర్ ఆఫీసులో బీజేడీ చీఫ్‌ త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు. హింజ్లీ నుంచి వ‌రుస‌గా అయిదోసారి న‌వీన్ పోటీకి దిగ‌నున్నారు. అయితే తొలిసారి న‌వీన్ రెండు స్థానాల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఈసారి బీజేపూర్ నుంచి కూడా ఆయ‌న పోటీ చేయ‌నున్నారు. ఈ రెండు స్థానాల‌కు ఏప్రిల్ 18వ తేదీన ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల‌కు నామినేష‌న్ దాఖ‌లు చేసిన మొద‌టి బీజేడీ వ్య‌క్తిగా సీఎం న‌వీన్ నిలిచారు.

810
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles