సరి-బేసి ఈనెల 15 వరకే: ఢిల్లీ ప్రభుత్వం

Sat,January 9, 2016 07:06 PM

odd even number system ends by 15th january delhi government

న్యూఢిల్లీ: ఢిల్లీ నగరంలో కాలుష్య నియంత్రణ కోసం ప్రయోగాత్మకంగా సరి-బేసి సంఖ్య విధానంలో వాహనాలను రోడ్డుపైకి అనుమతిస్తూ జనవరి 1 నుంచి పదిహేను రోజులపాటు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ట్రయల్ రన్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ట్రయల్ రన్ ఈనెల 15తో ముగుస్తుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి గోపాల్‌రాయ్ తెలిపారు. ఈ ట్రయల్ రన్‌పై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాకే తిరిగి పొడిగించే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ సరి-బేసి విధానాన్ని అవసరమైతే మరింత పొడిగించనున్నట్టు నిన్న ఆప్ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.

1515
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles