హోటల్‌పై నుంచి పడి ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త మృతి

Sat,November 10, 2018 10:30 AM

NRI Businessman Dies After Falling From Delhi Hotel's Terrace

న్యూఢిల్లీ: ఓ ఎన్‌ఆర్‌ఐ వ్యాపావేత్త ప్రమాదవశాత్తు జారీ కిందపడటంతో మృతిచెందాడు. ఈ ఘటన న్యూఢిల్లీలో శుక్రవారం చోటుచేసుకుంది. తాజ్ మాన్‌సింగ్ హోటల్ టెర్రస్ పైనుంచి ఎన్‌ఆర్‌ఐ బిజినెస్‌మెన్(48) ప్రమాదావశాత్తు జారిపడి చనిపోయాడు. పోలీసులు వివరాలను వెల్లడిస్తూ.. యూఎస్‌లోని మేరిల్యాండ్ నివాసి నరేందర్ ఏ మంగళం తాగిన అనంతరం విశ్రాంతి నిమిత్తం టెర్రస్ గార్డెన్‌లోకి వెళ్లాడు. గార్డెన్‌కి ప్రహరీ గోడ కానీ గ్రిల్స్ కానీ లేవు. బ్యాలెన్స్ తప్పడంతో అక్కడి నుంచి అతడు కిందపడి మృతిచెందాడు. జరిగిన విషాదంపై హోటల్ నిర్వాహకులు విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. విచారణకు పూర్తిగా సహకరించనున్నట్లు వెల్లడించారు.

1897
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles