పాన్‌కార్డ్ అప్లికేషన్‌లో కొత్తగా మరో ఆప్షన్

Tue,April 10, 2018 05:56 PM

Now Transgenders recognized as Independent Category in PAN application

న్యూఢిల్లీ: పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్) కోసం దరఖాస్తు చేసుకునే ట్రాన్స్‌జెండర్ల కోసం ఆదాయ పన్ను నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. దీనివల్ల ఇక నుంచి పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ట్రాన్స్‌జెండర్లు ఇండిపెండెంట్ జెండర్ కేటగిరీలో నమోదు చేసుకోవచ్చు. ట్రాన్స్‌జెండర్ల కోసం పార్ కార్డ్ అప్లికేషన్‌లో ఓ కొత్త టిక్ బాక్స్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చేర్చింది. ఇప్పటివరకు పాన్ అప్లికేషన్‌లో మేల్, ఫిమేల్ కేటగిరీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే తమకూ ఓ కాలమ్ ప్రత్యేకంగా యాడ్ చేయాలని కోరుతూ కొందరు విజ్ఞప్తి చేయడం వల్ల నిబంధనల్లో మార్పులు చేసినట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఆధార్‌లో థ‌ర్డ్‌ జెండర్ కేటగిరీ ఉన్నా పాన్‌లో ఆ ఆప్షన్ లేదు. దీంతో ట్రాన్స్‌జెండర్లు తమ పాన్‌కు ఆధార్‌ను లింక్ చేయడంలో ఇబ్బందుల ఎదురయ్యేవి. ఫామ్ 49ఎతోపాటు ఫామ్ 49ఎఎ (భారత పౌరులు కానివారి కోసం)లలో ఈ మార్పులు చేసినట్లు ఆ అధికారి చెప్పారు.

4669
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles