ఆ ఊళ్లో అందరూ కోటీశ్వరులే.. ఎక్కడ.. ఎలా?Thu,February 8, 2018 05:52 PM
ఆ ఊళ్లో అందరూ కోటీశ్వరులే.. ఎక్కడ.. ఎలా?

ఈటానగర్‌ః అదో చిన్న ఊరు. ఎక్కడో అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది. కానీ వాళ్ల అదృష్టం ఏమిటంటే అది చైనాకు దగ్గరగా ఉంది. డ్రాగన్‌కు చెక్ పెట్టడానికి అరుణాచల్ ప్రదేశ్‌లో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నది ఇండియన్ ఆర్మీ. ఇంకేం.. ధనలక్ష్మి వాళ్ల ఇళ్ల తలుపు తట్టింది. ఒక్కొక్కరు కోటీశ్వరులైపోయారు. తవాంగ్ జిల్లాలోని బొంజా గ్రామంలోని 31 కుటుంబాలూ.. ఇప్పుడు కోటీశ్వరులే. రక్షణశాఖకు వాళ్లు తమ 200 ఎకరాల భూములను ఇవ్వడానికి ఒప్పుకోవడంతో.. పరిహారంగా వాళ్లకు భారీ మొత్తం అందింది. రక్షణశాఖ రూ.40.8 కోట్లు రిలీజ్ చేయగా.. బుధవారం అరుణాచల్ సీఎం పెమా ఖండు వాళ్లకు చెక్కులు అందజేశారు. ఐదేళ్ల కిందటే ఈ ప్రాంతంలో ఆర్మీ స్థావరం ఏర్పాటు కోసం తమ భూములను ఇవ్వడానికి వీళ్లు అంగీకరించారు. వీళ్లలో అత్యధిక భూమిని ఇచ్చిన కుటుంబానికి రూ.6.73 కోట్లు పరిహారంగా దక్కగా.. మరో కుటుంబానికి రూ.2.45 కోట్లు ఇచ్చారు. మిగతా 29 కుటుంబాలు ఒక్కొక్కరికీ రూ.1.09 కోట్ల చెక్కులు అందజేశారు. బొంజా ఇప్పుడు దేశంలోని ధనికవంతమైన గ్రామం అయిపోయింది. కొందరైతే ఏషియాలోనే ధనిక గ్రామమని చెబుతున్నారు. ఇన్ని నిధులు విడుదల చేసిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం పెమా ఖండు కృతజ్ఞతలు చెప్పారు. ఇదే రాష్ట్రంలో గతేడాది మూడు గ్రామాల్లోని 152 కుటుంబాలకు రూ.54 కోట్లు చెల్లించింది రక్షణశాఖ.

5485
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Union Budget 2018