మరో అద్భుత కట్టడంగా కావేరీమాత విగ్రహం

Thu,November 15, 2018 05:43 PM

now a big statue to mother kaveri

ప్రస్తుతం భారీ విగ్రహల పోటీ సీజన్ నడుస్తున్నది. గుజరాత్‌లో సర్దార్ విగ్రహం, మహారాష్ట్రలో శివాజీ విగ్రహం తర్వాత ఇప్పుడు కర్నాటక వంతు వచ్చినట్టు కనిపిస్తున్నది. 125 అడుగుల కావేరీమాత విగ్రహం కట్టాలని తలపెట్టింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. దీనిని మరో అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు. పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలపడమే ధ్యేయంగా ఈ విగ్రహ నిరమాణం తలపెట్టారు. బెంగళూరుకు 90 కిలోమీటర్ల దూరంలోని మాండ్యా వద్దగల కృష్ణరాజసాగర్ రిజర్వాయర్ వద్ద ఆ భారీ విగ్రహం రూపుదాల్చబోతున్నది. రాబోయే రెండు సంవత్సరాల్లో విగ్రహాన్ని పూర్తిచేయాలని భావిస్తున్నారు.

దక్షిణాదిలోని అతిపెద్ద నదుల్లో గోదావరి, కృష్ణా తర్వాత కావేరీ మూడవ స్థానంలో ఉంది. కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ర్టాలకు ప్రాణాధారమైన కావేరి పశ్చిమకనుమల్లోని కొడగు ప్రాంతంలోని తలకావేరీలో పుడుతుంది. విగ్రహంతోపాటు మ్యూజియం కాంప్లెక్స్, రిజర్వాయర్ దృశ్యాలు వీక్షించేందుకు రెండు గ్లాస్ హౌసెస్, సంగీతవేదిక, ఇండోర్ స్టేడియం, చారిత్రిక కట్టడాల ప్రతిరూపాలు ఉంటాయి. విగ్రహం కోసం రిజర్వాయర్ దగ్గర సరస్సు నిర్మించాలని చూస్తున్నారు. కర్నాటక జలవనరుల మంత్రి శివకుమార్ ప్రస్తుతం విగ్రహం ప్రాజెక్టు ప్రఅణాళికకు తుదిమెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. ఈ విగ్రహ నిర్మాణానికి ప్రజల నుంచి పెట్టుబడులు ఆహ్వానించాలని కర్నాటక సర్కారు కసరత్తు చేస్తున్నది. నిజానికి అది విగ్రహం కాదు. ఓ టవర్‌లా ఉంటుంది అని మంత్రి శివకుమార్ చెప్పారు.

1332
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles