బీజేపీ ఎమ్మెల్యేకు నోటీసులు..

Fri,February 23, 2018 04:21 PM

Notice served to BJP MLA Shailendra jain


మధ్యప్రదేశ్ : ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన బీజేపీ ఎమ్మెల్యే శైలేంద్రజైన్‌కు మధ్యప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీచేశారు. రేపు ముంగావులీ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో..ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి పరిసర ప్రాంతాల్లో ఉన్నందుకు ఎమ్మెల్యే శైలేంద్రజైన్‌కు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే శైలేంద్రజైన్ ముంగావ్‌లీ ప్రాంతంలోని ఆలయం వద్ద ఉన్నట్లు సమాచారమందడంతో అక్కడికి చేరుకుని, ఆయన కారును సీజ్ చేసి, నోటీసులు అందజేశామని ఎస్పీ తిలక్ సింగ్ తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో నియోజకవర్గ పరిసర ప్రాంతాలను విడిచివెళ్లాలని ఎమ్మెల్యేకు సూచించామన్నారు.

1731
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS