శ్రీదేవి మృతిపై ఎలాంటి సందేహాలు లేవుః ప్రభుత్వం

Fri,March 9, 2018 04:46 PM

Nothing suspicious in Sridevis death says MEA

న్యూఢిల్లీః నటి శ్రీదేవి మరణంపై ఎలాంటి సందేహాలు లేవని భారత విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ.. యూఏఈ ప్రభుత్వం విచారణ పత్రాలు అన్నీ తమకు అందాయని చెప్పారు. ఆ విచారణ నివేదిక ప్రకారమే ఆమె మృతదేహం ఇండియాకు వచ్చింది. ఒకవేళ ఆమె మృతి అనుమానాస్పదంగా ఉంటే ఇప్పటివరకు ఆ కారణమేంటో బయటకు వచ్చేది కదా అని ఆయన అన్నారు. దుబాయ్ హోటల్ గదిలోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగి శ్రీదేవి మరణించినట్లు యూఏఈ ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. ఆమె ఫిబ్రవరి 24న చనిపోయినా.. ఫిబ్రవరి 27నగానీ ఆమె మృతదేహం ఇండియాకు రాలేదు. దుబాయ్ అధికారులు ఈ కేసుపై పూర్తి విచారణ జరిపి ప్రమాదవశాత్తూ జరిగిందేనని నిర్ధారించుకున్న తర్వాతే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిబ్రవరి 28న ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరపగా.. ఈ మధ్యే ఆమె అస్తికలను హరిద్వార్‌లో నిమజ్జనం చేసిన విషయం తెలిసిందే.


2346
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles