ఒక్క రోజు ముందే మాకు చెప్పారు: ఆర్బీఐ

Tue,January 10, 2017 04:14 PM

Note Ban is Governments decision and it is conveyed to us just a day before, says RBI

న్యూఢిల్లీ: నోట్ల ర‌ద్దుపై రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్ల‌మెంట‌రీ ప్యానెల్ స్టాండింగ్ క‌మిటీ ఆన్ ఫైనాన్స్‌కు త‌న వివ‌ర‌ణను లిఖితపూర్వ‌కంగా ఇచ్చింది. నోట్లు ర‌ద్దు చేయాల‌న్న నిర్ణ‌యం ప్ర‌భుత్వానిదే అయినా.. అది స‌రైన స‌మ‌యంలోనే వ‌చ్చింద‌ని అభిప్రాయ‌ప‌డింది. 500, వెయ్యి నోట్ల‌ను ర‌ద్దు చేయాల్సిందిగా ప్ర‌భుత్వం న‌వంబ‌ర్ 7న ఆర్బీఐని ఆదేశించింది. ఆ త‌ర్వాత రోజే ఆర్బీఐ బోర్డు ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పింది. కాసేపటికే ప్ర‌ధాని మోదీ ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. నోట్ల ర‌ద్దుపై స‌మీక్ష నిర్వ‌హిస్తున్న స్టాండింగ్ క‌మిటీ ఆన్ ఫైనాన్స్‌కు ఆర్బీఐ లిఖితపూర్వ‌కంగా ఈ వివ‌ర‌ణ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంతో ఆర్బీఐ త‌న స్వ‌తంత్ర‌త విష‌యంలో రాజీ ప‌డింద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. న‌ల్ల‌ధ‌నం, అవినీతి, ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలను అరిక‌ట్ట‌డంలో భాగంగా కొత్త నోట్ల‌ను తీసుకురావ‌డానికి గ‌త కొన్ని నెల‌లుగా ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేస్తున్న‌ట్లు ఆర్బీఐ వెల్ల‌డించింది. కొత్తగా 2000 నోట్ల‌ను తీసుకురావాల్సిందిగా ప్ర‌భుత్వం ఆదేశించిన‌ట్లు గ‌తేడాది మేలో ఆర్బీఐ చెప్పింది.

1054
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles