యుద్ధం వద్దు.. చర్చలే మంచిది: పుల్వామా అమరవీరుడి భార్య

Thu,February 28, 2019 03:34 PM

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఇండియా, పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడానికి పుల్వామాలో జరిగిన ఉగ్రదాడే కారణమన్న సంగతి తెలుసు కదా. అయితే అదే ఉగ్రదాడిలో మరణించిన వీర జవాను బబ్లూ సాంత్రా భార్య మితా సాంత్రా మాత్రం ఈ ఉద్రిక్తతలను తగ్గించండి.. చర్చలు మొదలుపెట్టండి అని కోరుతున్నది. యుద్ధం వద్దే వద్దని ఆమె స్పష్టం చేస్తున్నది. అంతేకాదు ప్రస్తుతం పాక్ చెరలో ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ అభినందన్‌ను కూడా సురక్షితంగా తిరిగి తీసుకురావాలని మోదీ సర్కార్‌ను ఆమె కోరింది. యుద్ధం వద్దంటున్నందుకు తనపై సోషల్ మీడియాలో వచ్చే విమర్శల గురించి తాను ఆలోచించడం లేదని మితా స్పష్టం చేసింది. యుద్ధం వల్ల మరెంతో మంది చనిపోయే ప్రమాదం ఉంది. దాని బదులు చర్చలే మంచిది అని మితా చెబుతున్నది.


ప్రాణ నష్టంతోపాటు దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా కూడా యుద్ధం దెబ్బ కొడుతుందని మితా అభిప్రాయపడింది. యుద్ధం వస్తే రణరంగంలోకి దిగేది సాయుధ బలగాలే అని, వారి భద్రతను చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని మితా చెప్పింది. యుద్ధం వద్దు అంటున్నందుకు తనపై వచ్చే విమర్శలపై స్పందిస్తూ.. అసలు పుల్వామా దాడి తర్వాత తాను ఇంకేమీ పట్టించుకోవడం లేదని, ఈ విమర్శలపై తనకేమీ బాధలేదని మితా స్పష్టం చేసింది. ఎంతో మంది ఇళ్లలో కూర్చొని ఏవేవో మాటలు మాట్లాడుతున్నారని, వాళ్ల కుటుంబాల నుంచి ఎవరైనా సాయుధ బలగాల్లో ఉన్నారా అంటూ ఆమె ప్రశ్నించింది.

3937
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles