క్లాస్ లీడర్ కాలేదని విద్యార్థి ఆత్మహత్య

Thu,July 12, 2018 02:10 PM

Not elected class leader after 14 year old boy ends life in Bengaluru

బెంగళూరు : తానే క్లాస్ లీడర్ కావాలని ప్రతి విద్యార్థికి బలమైన కోరిక ఉంటుంది. అందుకు విద్యార్థులందరూ పోటీ పడుతుంటారు. పోటీ పడిన ఓ విద్యార్థి.. క్లాస్ లీడర్‌గా ఎంపిక కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన బెంగళూరు రాజరాజేశ్వరీనగర్‌లోని ఐడియల్ హోమ్ టౌన్‌షిప్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. బాల్దిన్ కో ఎడ్యుకేషన్ ఎక్స్‌టెన్షన్ హై స్కూల్‌లో ఆర్. ధృవ్‌రాజ్ అనే విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. నెల రోజుల క్రితం క్లాస్ లీడర్లకు స్కూల్ యాజమాన్యం ఎన్నికలు నిర్వహించింది. తొమ్మిదో తరగతి నుంచి నలుగురు విద్యార్థులు పోటీ పడ్డారు. వీరిలో ఒకరు ధృవ్‌రాజ్. అయితే ధృవ్‌రాజ్ తాను గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నాడు. ఇటీవల క్లాస్ లీడర్ల ఎంపిక జాబితాను స్కూల్ యాజమాన్యం జూన్ 10న విడుదల చేసింది. ఆ జాబితాలో ధృవ్‌రాజ్ పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సాయంత్రం ఇంటికి చేరుకున్న ధృవ్‌రాజ్.. అదే రోజు రాత్రి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

1522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles