కేరళకు కావాల్సింది ఆహారం, బట్టలు కాదు..

Mon,August 20, 2018 01:44 PM

Not clothes or food need skilled people to come and rebuild Kerala

న్యూఢిల్లీ : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ర్టానికి ప్రస్తుతం కావాల్సింది ఆహారం, బట్టలు కాదు అని కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్ పేర్కొన్నారు. కేరళకు కావాల్సింది నైపుణ్యమంతులైన వేలాది మంది ఇంజినీర్లు, ఎలక్ట్రిషీయన్లు, కార్పెంటర్లు, ప్లంబర్లు కావాలన్నారు. కేరళను పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారు కేరళకు వచ్చి తమవంతు సాయం చేయాలని కేంద్రమంత్రి కోరారు. ఆశ్రయాలను కోల్పోయిన 3 లక్షల మంది ప్రజలు వేలాది పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారని ఆల్ఫోన్స్ వెల్లడించారు. వీరిందరికి ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

4890
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles