నానాపటేకర్‌పై లైంగిక ఆరోపణలకు ఆధారాలు లేవు

Thu,June 13, 2019 03:37 PM

No Proof To Prosecute Nana Patekar In Sex Harassment Case

ముంబయి: సహ నటుడు నానాపటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నటి తనుశ్రీదత్తా ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. తనుశ్రీదత్తా మీటు ఆరోపణలకు ఆధారాలు లేవన్న పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కోర్టుకు బి-సమ్మరీ నివేదిక సమర్పించారు. ఫిర్యాదుదారు ఆరోపణలకు సంబంధించి ఆధారాలు లభ్యం కానప్పుడు బి-సమ్మరీ నివేదిక సమర్పిస్తారు. దీంతో త్వరలోనే తనుశ్రీదత్తా మీటు కేసును పోలీసులు మూసివేయనున్నారు. పదేళ్ల క్రితం నానాపటేకర్ తనను లైంగికంగా వేధించినట్లు తనుశ్రీదత్తా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈమె ఆరోపణల అనంతరం దేశంలో మీటు ఉద్యమం జోరందుకుంది.

1029
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles