రాఫెల్ కొనుగోలుపై ద‌ర్యాప్తు అవ‌స‌రం లేదు : సుప్రీంకోర్టు

Fri,December 14, 2018 11:02 AM

No probe into pricing or decision making of Rafale deal, says Supreme Court

న్యూఢిల్లీ: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వానికి ఇదో పెద్ద ఊర‌ట‌. కోర్టు స‌మ‌క్షంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై ద‌ర్యాప్తు జ‌ర‌గాల‌ని వేసిన పిటీష‌న్ల‌ను సుప్రీం కొట్టిపారేసింది. రాఫెల్ వివాదంపై ఎటువంటి విచార‌ణ అవ‌స‌రం లేద‌ని, దాంట్లో జోక్యం చేసుకోవాల్సిన ఎటువంటి కోణం లేద‌ని కోర్టు పేర్కొన్న‌ది. రాఫెల్ కొనుగోలు ప్ర‌క్రియ‌పై అనుమానాలు వ్య‌క్తం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, రాఫెల్ ఖ‌రీదును క్షుణ్ణంగా ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం లేద‌ని కోర్టు తెలిపింది. రాఫెల్ విమానాల‌ను ఎంత ధ‌ర పెట్టి కొన్నారు, ఆ విమానాల కొనుగోలుకు ఎటువంటి ప్ర‌క్రియ‌ను అవ‌లంబించార‌న్న అంశాల‌ను ద‌ర్యాప్తు చేయాల్సిన ప‌ని లేద‌ని కోర్టు చెప్పింది. డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ లాంటి సున్నిత‌మైన అంశాల లోతుకు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని సీజేఐ రంజ‌న్ గ‌గోయ్ అన్నారు.

ఫ్రాన్స్ నుంచి భార‌త్ 36 రాఫెల్ యుద్ధ విమానాల‌ను కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్న‌ది. అయితే వాటి నిర్మాణం కోసం రిల‌య‌న్స్ డిఫెన్స్ సంస్థ‌కు బాధ్య‌త‌లు అప్ప‌గింది. దీనిపై ప్ర‌తిప‌క్షాలు భ‌గ్గుమంటున్నాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ‌ను కాకుండా, రిల‌య‌న్స్‌కు ఎలా ఇస్తార‌ని విప‌క్షాలు అడుతున్నాయి. ఈ అంశంలో సుమారు 58 వేల‌ కోట్ల కుంభ‌కోణం జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. రాఫెల్ యుద్ధ విమానం నాణ్య‌త‌పై అనుమానాలు వ్య‌క్తం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని సీజేఐ అన్నారు.

1264
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles