అఫిషియ‌ల్ ఎఫ్‌బీ పేజీల‌కు ఏమీకాలేదు : కాంగ్రెస్ పార్టీ

Mon,April 1, 2019 05:48 PM

no official facebook pages of INC were taken down, tweets congress party

హైద‌రాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 687 న‌కిలీ అకౌంట్ల‌ను తొల‌గించిన‌ట్లు ఇవాళ ఫేస్‌బుక్ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. తమ పార్టీకి చెందిన అధికారిక ఎఫ్‌బీ పేజీలు ఏవీ కూడా తొల‌గించ‌బ‌డ‌లేద‌ని త‌న ట్విట్ట‌ర్‌లో స్ప‌ష్టం చేసింది. పార్టీ అనుమ‌తి ఉన్న వాలంటీర్లు న‌డిపిస్తున్న ఎఫ్‌బీ పేజీలకు కూడా ఏమీకాలేద‌ని కాంగ్రెస్ వెల్ల‌డించింది. అనుచిత ప‌ద్ధ‌తుల్లో స‌మాచారాన్ని చేర‌వేస్తున్న కాంగ్రెస్ అకౌంట్ పేజీల‌ను తొల‌గించినట్లు ఇవాళ ఎఫ్‌బీ సైబ‌ర్ సెక్యూర్టీ హెడ్ తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఆ సోష‌ల్ మీడియా సంస్థ నుంచి పూర్తి స‌మాచారం కోసం ఎదురుచూస్తున్నామ‌ని కాంగ్రెస్ తెలిపింది.707
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles