మా వాడు ఉగ్రవాది అని నాకు తెలియదు!

Fri,February 15, 2019 05:53 PM

No idea about his terror links says Pulwama suicide bomber Adils father Gulam

శ్రీనగర్: తన కొడుకు ఉగ్రవాది అన్న విషయం తనకు తెలియదని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి చేసిన ఆదిల్ అహ్మద్ దార్ తండ్రి గులామ్ దార్ చెప్పాడు. అతని ఉగ్రవాద కార్యకలాపాల గురించి తనకేమాత్రం తెలియదని, జమ్ముకశ్మీర్ పోలీస్ చెబితేనే అతని దాడి గురించి తెలిసిందని అతనన్నాడు. ఇండియా టుడే చానెల్ గులామ్ దార్ అభిప్రాయాలను సేకరించింది. మా వాడు పన్నెండో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే జమ్ము వెళ్లిన అతడు తిరిగి రాలేదు అని గులామ్ చెప్పాడు. అసలు అతనికి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న విషయం తనకు తెలియదని అతను చెప్పడం విశేషం. కారులో 320 కిలోల పేలుడు పదార్థాలతో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై అతను దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఓ బస్సును ఈ కారు ఢీకొట్టడంతో ఏకంగా 49 మంది జవాన్లు మరణించారు.

13826
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles