జనవరి నుంచి నెఫ్ట్ లావాదేవీలు ఉచితం

Sat,November 9, 2019 09:43 AM

ముంబై: నెఫ్ట్ ద్వారా జరిపే లావాదేవీలపై చార్జిలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ తాజాగా ప్రకటించింది. ఈ చార్జీల ఎత్తివేత జనవరి 2020 నుంచి అమలులోకి రానున్నది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఇప్పటికే ఆర్టీజీఎస్ లావాదేవీలపై చార్జీలను ఎత్తివేసిన సెంట్రల్ బ్యాంక్..తాజాగా నెఫ్ట్ లావాదేవీలపై కూడా చార్జీలను విరమించుకున్నది. పెద్ద నోట్ల రద్దు చేసి మూడేండ్లు పూర్తైన రోజునే ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ ప్రయోజనాన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు బదిలీ చేయాలని నియంత్రణ మండలి సూచించింది.


ప్రస్తుతం పలు బ్యాంకులు ఒక్కో లావాదేవీపై రూపాయి నుంచి రూ.15 వరకు చార్జిని వసూలు చేస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో నెఫ్ట్ ద్వారా లావాదేవీలు జరిపేవారికి చార్జీల నుంచి ఊరట లభించినట్లు అవుతున్నది. వీటితోపాటు పార్కింగ్ ఫీజు, చమురు బంకుల్లో వేగవంతంగా లావాదేవీలు జరిపే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నది. అక్టోబర్ 2018 నుంచి సెప్టెంబర్ 2019 వరకు దేశవ్యాప్తంగా జరిగిన నగదు రహిత రిటైల్ చెల్లింపుల్లో 96 శాతం డిజిటల్ పేమెంట్ ద్వారా జరిగాయి. ఇదే సమయంలో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్(నెఫ్ట్) ద్వారా 252 కోట్ల లావాదేవీలు జరుగగా, యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) ద్వారా 874 కోట్ల లావాదేవీలు జరిగాయి.

561
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles