ఆదాయ పన్ను రేట్లలో మార్పులేదు

Thu,February 1, 2018 12:49 PM

No change in personal income tax slab rates says Arun Jaitly

న్యూఢిల్లీః సగటు వేతన జీవికి ఎలాంటి ఊరట కలిగించలేదు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఈసారైనా ఆదాయపన్ను పరిమితిని పెంచుతారని ఎంతో ఆశగా ఎదురుచూసిన కోట్ల మంది వేతన జీవులకు నిరాశే ఎదురైంది. పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టంచేశారు. గతంలో వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లలో ఎన్నో సానుకూల మార్పులు చేశామని, ఈసారి మాత్రం స్లాబులలో ఎలాంటి మార్పు ఉండబోదని జైట్లీ చెప్పారు. ఇక 2017-18 ఏడాది ప్రత్యక్ష పన్ను వసూళ్లు 12.6 శాతం పెరిగినట్లు తెలిపారు. ఇక పరోక్ష పన్ను వసూళ్లు 18.7 శాతం పెరిగినట్లు జైట్లీ వెల్లడించారు. పన్ను పరిధిలోకి కొత్తగా చాలామంది వచ్చి చేరుతున్నా.. టర్నోవర్ మాత్రం ఆశించినంతగా లేదని అన్నారు.

3861
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles