‘కింగ్ ఫిషర్ విల్లా’ వేలానికి ఒక్కరు రాలేదు..

Wed,October 19, 2016 05:36 PM

No bidder turns up for Kingfisher Villa


ముంబై: కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్‌మాల్యాకు చెందిన ‘కింగ్ ఫిషర్ విల్లా’ను ఎస్‌బీఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల రుణదాతల కన్సార్టియమ్ ఇవాళ వేలానికి ఉంచిన సంగతి తెలిసిందే. బిడ్డర్లకు ఆహ్వానం పలికేందుకు రుణదాతల కన్సార్టియమ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

కింగ్ ఫిషర్ విల్లాను వేలం వేయనున్నట్లు ముందే ప్రకటించినప్పటికీ వేలానికి ఒక్క బిడ్డర్ కూడా హాజరుకాకపోవడం గమనార్హం. గోవాలోని అందమైన బీచ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న రూ. 85.3 కోట్ల విలువైన కింగ్ ఫిషర్ విల్లాను రుణదాతల కన్సార్టియం గత మే నెలలోనే తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

3552
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles