మహాకూటమి లేనట్లే.. కాంగ్రెస్ నా ఆఫర్ తిరస్కరించింది!

Mon,February 25, 2019 01:33 PM

No Alliance with Congress in Delhi says Aravind Kejriwal

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నది ఆమ్ ఆద్మీ పార్టీ. కాంగ్రెస్‌తో మహా కూటమి లేనట్లే అని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కూటమి కడదామన్న తన ఆఫర్‌ను కాంగ్రెస్ తిరస్కరించిందని ఆయన చెప్పారు. వాళ్లు కూటమికి నో చెప్పారు. ఈ విషయంలో వాళ్లు నిర్ణయం మార్చుకునే అవకాశం కనిపించడం లేదు అని కేజ్రీవాల్ అన్నారు. దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు మోదీ, షా ద్వయాన్ని అధికారంలో నుంచి దించడమే అని, అందుకే కాంగ్రెస్‌తో తనకు శతృత్వం ఉన్నా కూడా కూటమికి సిద్ధపడినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ ద్వయం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది. పాకిస్థాన్‌కు 70 ఏళ్లలో సాధ్యం కాని రీతిలో దేశ ఐక్యతను దెబ్బతీశారు. ద్వేషాన్ని పెంచి పోషించారు. వాళ్లు అడ్డుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధం. అంతేతప్ప కాంగ్రెస్ అంటే ప్రత్యేకమైన ప్రేమ ఏమీ లేదు అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ తన ఆఫర్‌ను తిరస్కరించిందని, ఇప్పుడు ఒంటరిగా వెళ్లడం తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు. అన్ని రాష్ర్టాల్లో ప్రతిపక్షాలను కాంగ్రెస్ బలహీనం చేస్తున్నదని, ఢిల్లీలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీయే ఏడుకు ఏడు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి ఏడు స్థానాలనూ బీజేపీ గెలుచుకున్న విషయం తెలిసిందే.

4835
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles