క్యాబ్ డ్రైవర్‌తో గుంజీలు తీయించిన ఎంఎన్‌ఎస్ నేత..వీడియో

Fri,February 23, 2018 05:10 PM

Nitin Nandgokar made a cab driver do sit-ups at Mumbai airport


ముంబై : ఎంఎన్‌ఎస్ (మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన) నేత క్యాబ్ డ్రైవర్‌తో గుంజీలు తీయించాడు. ఈ ఘటన ముంబై ఎయిర్‌పోర్టు వద్ద జరిగింది. ఎంఎన్‌ఎస్ నేత నితిన్ నంద్‌గోకర్ ఎయిర్‌పోర్టు నుంచి వస్తుండగా క్యాబ్ డ్రైవర్‌ను చూశాడు. సదరు క్యాబ్ డ్రైవర్‌కు యూనిఫాం, బ్యాడ్జి లేకపోవడంతో నితిన్ నంద్‌గోకర్ క్యాబ్‌డ్రైవర్‌తో గుంజీలు తీయించాడు.

‘ట్యాక్సీ డ్రైవర్ బ్యాడ్జీ, యూనిఫాం లేకుండా ముంబై ఎయిర్‌పోర్టు వద్ద కనిపించాడు. నిబంధనల ప్రకారం ట్యాక్సీ నడపాలని అతనికి సూచించా. అతనిలా మరో డ్రైవర్ చేయకూడదన్న ఉద్దేశంతో ఆ సమయంలో క్యాబ్ డ్రైవర్‌తో గుంజీలు తీయించినట్లు’ నితిన్ నంద్‌గోకర్ చెప్పారు. క్యాబ్‌డ్రైవర్‌తో గుంజీలు తీయించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.


1922
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS