నిట్ విద్యార్థి ఆత్మహత్య

Mon,November 19, 2018 11:29 AM

NIT Mechanical Engineering Student Suicide in Karnataka

మంగళూరు : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(కర్ణాటక)లో విద్యను అభ్యసిస్తున్న మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరో అంతస్తులోని తన డిపార్ట్ మెంట్ కిటికీలో నుంచి కిందకు దూకడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఇంజినీరింగ్ స్టూడెంట్ ఆనంద్ పఠాక్. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. అయితే డిపార్ట్ ప్రొఫెసర్ వేధింపుల వల్లే ఆనంద్ పఠాక్ ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆనంద్ పఠాక్ హాజరు శాతం తక్కువగా ఉందని.. సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ప్రొఫెసర్ వేధించినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పఠాక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్టూడెంట్స్ చెప్పారు. ఆనంద్ పఠాక్ మృతికి కారణమైన ప్రొఫెసర్ సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మృతుడు పఠాక్ స్వస్థలం మహారాష్ట్ర.

2003
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles