నిఫా వైర‌స్‌.. ఆందోళ‌న వ‌ద్ద‌న్న కేంద్రం

Tue,June 4, 2019 11:56 AM

Nipah virus, Union Health Minister Harshavardhan, says no need to worry

హైద‌రాబాద్‌: కేర‌ళ‌లోని ఓ కొచ్చి విద్యార్థికి నిఫా వైర‌స్ సోకిన‌ట్లు ఇవాళ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ స్పందించారు. హెల్త్ సెక్ర‌ట‌రీతో పాటు ఇత‌ర ఆరోగ్య‌శాఖ ఆఫీస‌ర్ల‌తో త‌న ఇంట్లో మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ స‌మావేశం నిర్వ‌హించారు. కేర‌ళ‌కు సోమ‌వార‌మే ఆరుగురు నిపుణుల‌ను కేర‌ళ‌కు పంపిన‌ట్లు మంత్రి చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని కేర‌ళ ఆరోగ్య‌శాఖ మంత్రికి తెలియ‌జేసిన‌ట్లు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెలిపారు. వ‌ణ్య‌ప్రాణి శాఖ‌తోనూ ట‌చ్‌లో ఉన్నామ‌ని, గ‌బ్బిలాలను ప‌రీక్షిస్తున్న‌ట్లు చెప్పారు. నిఫా గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ చెప్పారు.

644
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles