బెంగాల్‌లో తుది విడతలోనూ ఆగని హింస

Sun,May 19, 2019 01:41 PM

Nilanjan Roys car vandalised in Dongaria area of the constituency

కోల్‌క‌తా:పశ్చిమ బెంగాల్‌లో సార్వత్రిక ఎన్నికల తుదివిడతలోనూ ఘర్షణలు జరిగాయి. పలుచోట్ల బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఉత్తర, దక్షిణ కోల్‌కతాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్‌ ఏజెంట్లను బెదిరించి బయటకు పంపుతున్నారని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. బెంగాల్‌ మినహా మిగతా రాష్ర్టాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. డోంగారియా ప్రాంతంలో డైమండ్‌ హార్బర్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి నిరంజన్‌ రాయ్‌ కారును దుండగులు ధ్వంసం చేశారు. బిహార్‌లోని నలంద జిల్లాలోని ఓ గ్రామంలో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. తమ గ్రామంలో రోడ్లు లేవు.. ఓట్లు వేయమని నిరసన తెలిపారు.1301
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles