మూడు రాష్ర్టాలకు కొత్త గవర్నర్లు

Thu,August 18, 2016 02:18 AM

-మణిపూర్‌కు నజ్మాహెప్తుల్లా, పంజాబ్‌కు వీపీ సింగ్ బద్నోర్,
-అసోంకు బన్వరిలాల్ నియామకం
-అండమాన్ ఎల్జీగా జగదీశ్ ముఖికి బాధ్యతలు
-ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ, ఆగస్టు 17: మణిపూర్, పంజాబ్, అసోం రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను, కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమిస్తూ.. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. మణిపూర్ గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి నజ్మాహెప్తుల్లా, పంజాబ్‌కు మాజీ రాజ్యసభ సభ్యుడు వీపీ సింగ్ బద్నోర్, నాగ్‌పూర్‌నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన, ది హితవాద మేనేజింగ్ ఎడిటర్ బన్వరిలాల్ పురోహిత్ నియమితులయ్యారు. ఢిల్లీకి చెందిన బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ప్రొఫెసర్ జగదీశ్ ముఖి కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతిభవన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
list005
75 ఏండ్లు దాటితే మంత్రి పదవులు వీడాలన్న ప్రధాని నరేంద్రమోదీ మార్గదర్శకాల మేరకు నజ్మాహెప్తుల్లా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పటివరకు మేఘాలయ గవర్నర్ వీ షణ్ముగనాథన్ మణిపూర్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలతో కొనసాగుతుండగా.. ఇకపై నజ్మాహెప్తుల్లా పూర్తిస్థాయి బాధ్యతలు చేపడుతారు. పంజాబ్ గవర్నర్‌గా రాజస్థాన్‌కు చెందిన 68 ఏండ్ల బద్నోర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు పంజాబ్ గవర్నర్‌గా హర్యానా గవర్నర్ కప్తాన్‌సింగ్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది పంజాబ్‌లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పంజాబ్‌కు పూర్తిస్థాయి గవర్నర్‌ను నియమించడం విశేషం. నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య అసోం గవర్నర్‌గా కూడా కొనసాగుతుండగా.. 76 ఏండ్ల పురోహిత్ ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో ఢిల్లీలోని జానకిపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రొఫెసర్ జగదీశ్ ముఖిని అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు.

2249
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles