విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం

Sat,January 19, 2019 06:33 AM

New Delhi severe interruption of flights weather effect

న్యూఢిల్లీ, : పొగమంచు ఢిల్లీని మళ్లీ కప్పేసింది. ప్రధానంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఉదయం దట్టమైన పొగమంచు ఉండటంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు తగ్గకపోవడంతో దాదాపు 450 విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. అధికార వర్గాలు మాట్లాడుతూ పొగమంచు వల్ల కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయని, కొన్ని సర్వీసులను రద్దు చేశామని తెలిపాయి. మరి కొన్ని విమానాలను దారి మళ్లించామని పేర్కొన్నాయి. జెట్ ఎయిర్‌వేస్ ట్వీట్ చేస్తూ బెంగళూరులోనూ పొగమంచు వల్ల తమ విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నాయి.

780
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles