ఫేస్ బుక్ లో ప్రేమించకండి..

Thu,December 20, 2018 03:49 PM

ప్రేమకు ఎల్లలు లేవు.. కానీ ప్రేమించడం నేరం.. ఎందుకంటే తనకు నచ్చిన పాక్ యువతిని ప్రేమించి.. ఆరేండ్ల జైలు పాలయ్యాడు. ఫేస్ బుక్ వేదికగా ప్రేమించిన పాపానికి తన ప్రేయసిని కలుసుకునేందుకు దాయాది దేశమైన పాకిస్థాన్ లోకి అక్రమంగా ప్రవేశించాడని అక్కడి అధికారులు.. ఓ భారతీయుడికి ఆరేండ్ల పాటు జైలు శిక్ష విధించారు. మొత్తానికి ఆరేండ్ల జైలు శిక్ష అనుభవించిన ముంబై సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హమీద్ నీహాల్ అన్సారీ.. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చొరవ, సహకారంతో ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు.


ఈ సందర్భంగా తాను జైలు జీవితంలో నేర్చుకున్న పాఠాలు, అనుభావాలను అన్సారీ మీడియాతో పంచుకున్నాడు. ముఖ్యంగా మూడు విషయాలు చెబుతున్నాను. మొదటిది.. నేను యువతరానికి ఇచ్చే సందేశం ఒక్కటే.. సామాజిక మాధ్యమాల వేదికగా ఎవరూ కూడా ప్రేమలో పడొద్దు. రెండోది.. తల్లిదండ్రులకు అబద్దాలు చెప్పొద్దు. చివరిది తప్పుడు మార్గాన్ని ఎంచుకోవద్దు. తల్లిదండ్రులకు అబద్దాలు చెప్పడం వల్ల మనకు ఏమీ రాదు. మనకు ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులే అండగా నిలుస్తారు తప్ప వేరే వాళ్లు అండగా నిలువరు. మనం ఒక ప్రదేశం కానీ, ఇతర విషయాల్లో.. తప్పుడు మార్గం ద్వారా వెళ్లకూడదు అని అన్సారీ చెప్పాడు.

పాకిస్థాన్‌లో ఆరేండ్ల జైలు జీవితం గడిపిన ముంబై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హమీద్ నీహాల్ అన్సారీ బుధవారం విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కలుసుకున్నారు. పాక్‌లో తాను అనుభవించిన కష్టాలను ఈ సందర్భంగా చెప్పుకున్నారు. మేరా భారత్ మహాన్, మేరీ మేడం మహాన్. మేరీ మేడం నే హీ కియా హై సబ్ కుచ్ (నా దేశం గొప్పది. మేడం (సుష్మాస్వరాజ్) గొప్పవారు. మేడం నాకు సహాయం చేశారు) అని అన్సారీ అన్నారు. సుష్మాను హత్తుకున్న అన్సారీ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. అన్సారీతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మంత్రిని కలుసుకుని ధన్యవాదాలు తెలిపారు.

1622
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles