నెహ్రూ విగ్రహాన్ని తొలగించారు.. ఎందుకంటే

Fri,September 14, 2018 01:46 PM

Nehru statue removed in Allahabad for Kumbh mela

అలహాబాద్: భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహాన్ని తొలగించారు. అలహాబాద్‌లోని బల్సాన్ చౌరాహా ప్రాంతం నుంచి ఆ విగ్రహాన్ని క్రేన్లతో ఎత్తుకెళ్లారు. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న కుంభమేళా కోసం ఆ విగ్రహాన్ని తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నగర సుందరీకరణ కోసం విగ్రహాన్ని తొలగించాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ తొలగింపును అడ్డుకున్నారు. మాజీ ప్రధానిని అవమానించారన్నారు. కావాలనే విగ్రహాన్ని తొలగించారని కాంగ్రెస్‌తో పాటు ఎస్పీ పార్టీలు ఆరోపించాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. సుందరీకరణ కోసం నెహ్రూ విగ్రహాన్నే ఎందుకు తొలగించారు, అదే వీధిలో ఉన్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఎందుకు తొలగించలేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. కుంభమేళా కోసం ఏర్పాట్లు చేస్తున్నామని, రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా నెహ్రూ విగ్రహాన్ని తొలగించామని అధికారులు చెప్పారు.

2679
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles