నెహ్రూ మెమోరియల్‌ను మార్చకండి..

Mon,August 27, 2018 02:59 PM

Nehru Memorial Museum should be left undisturbed, says Manmohan Singh

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఉన్న నెహ్రూ మ్యూజియంను మార్చకూడదంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. ఇవాళ ప్రధాని మోదీకి లేఖ రాశారు. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో దేశ ప్రధానుల సమాచరాన్ని పెట్టాలని కేంద్రం యోచిస్తున్నది. ఈ నేపథ్యంలో అలాంటి చర్యలు ఏమీ చేపట్టకూడదంటూ మన్మోహన్ తన లేఖలో కేంద్రాన్ని కోరారు. తీన్‌మూర్తీ కాంప్లెక్స్‌లోని నెహ్రూ మ్యూజియం కాంగ్రెస్ పార్టీకి చెందినది కాదని, అది యావత్ దేశానికి చెందినదని మన్మోహన్ అన్నారు. నెహ్రూ స్మారక కేంద్రంలో ఇప్పటి వరకు దేశానికి ప్రధానిగా సేవలు చేసిన వారి జీవితవిశేషాలను పొందుపరుచాలని ఇటీవల మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతిచెందిన తర్వాత ఈ అంశంపై ఎన్డీఏ ప్రభుత్వం తీవ్ర కసరత్తులు మొదలుపెట్టింది. దీంతో మన్మోహన్ ఈ అంశంపై స్పందిచారు. నెహ్రూ మ్యూజియంను ఎవరూ డిస్టర్బ్ చేయరాదంటూ లేఖలో కోరారు. భారత జాతి నిర్మాత, మొదటి ప్రధాని నెహ్రూ కోసం ఆ మ్యూజియంను అంకితం చేశామని, ఆయన గొప్పతనాన్ని శత్రువులు కూడా మెచ్చుకున్నారని, మాజీ ప్రధాని వాజ్‌పేయి కూడా నెహ్రూను కీర్తించారని తన లేఖలో మన్మోహన్ తెలిపారు.

1167
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles